విశాఖ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇవే..

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇప్పటికే 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటనలో అప్పల నరసమ్మ(45), కుందన శ్రేయ(6), ఏ చంద్రమౌళీ(19), సీహెచ్ గంగరాజు(48), ఆర్ నారాయణమ్మ(35), ఎన్. గ్రీష్మ(9), మేక కృష్ణమూర్తి(73), గంగాధర్, నాని‌తో పాటు మరొక వ్యక్తి  మృతి చెందారు. ఇక ఈ విషవాయువును పీల్చి సుమారు 316 మంది క్షతగాత్రులు కేజీహెచ్, అపోలో, కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే విషవాయువు వెలువడిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అధికారులు […]

విశాఖ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇవే..
Follow us

|

Updated on: May 07, 2020 | 7:02 PM

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇప్పటికే 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటనలో అప్పల నరసమ్మ(45), కుందన శ్రేయ(6), ఏ చంద్రమౌళీ(19), సీహెచ్ గంగరాజు(48), ఆర్ నారాయణమ్మ(35), ఎన్. గ్రీష్మ(9), మేక కృష్ణమూర్తి(73), గంగాధర్, నాని‌తో పాటు మరొక వ్యక్తి  మృతి చెందారు. ఇక ఈ విషవాయువును పీల్చి సుమారు 316 మంది క్షతగాత్రులు కేజీహెచ్, అపోలో, కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే విషవాయువు వెలువడిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కాగా, గ్యాస్ లీక్ ఘటన బాధితుల కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. బాధితుల సాయం కోసం 7997952301, 8919239341, 9701197069ను సంప్రదించాలని తెలిపారు.