వాళ్లకు రూ. 5 వేలు సాయం చేయండి.. జగన్‌కు పవన్ విజ్ఞప్తి..
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారని.. వారి కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ కూలీలు, బార్బర్లు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మెకానిక్‌లు, […]

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారని.. వారి కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ కూలీలు, బార్బర్లు, రజకులు, వడ్రంగి, చేనేత కార్మికులు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రికల్ పనులు చేసేవారు, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు నడిపేవారు.. ఇలా ఎంతోమందికి లాక్ డౌన్ తీవ్రమైన ఆర్ధిక నష్టాన్ని చేకూర్చింది. వీరందరిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని.. ఒక్కొక్కరికి రూ. 5 వేలు తక్కువ కాకుండా సాయం చేయాలని పవన్ సూచించారు.
ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన వారి కోసం రూ.1610 కోట్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఏపీలో కూడా అలాంటి నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ బిల్లుల విషయంలో రాయితీలను కల్పించాలని.. ఆస్తి, వృత్తి పన్నుల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంని కోరారు.




