AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ ఎత్తివేస్తే అంతే సంగతులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక..

కోవిద్-19 ‌ను కట్టడి చేసేందుకు పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా హెచ్చరించింది. కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నందున కరోనా

లాక్‌డౌన్ ఎత్తివేస్తే అంతే సంగతులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 07, 2020 | 1:17 PM

Share

కోవిద్-19 ‌ను కట్టడి చేసేందుకు పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా హెచ్చరించింది. కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నందున కరోనా ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. జెనీవాలో వర్చువల్ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. ప్రపంచ దేశాలు కరోనా వైరల్ వ్యాధి వ్యాప్తిని తనిఖీ చేయడానికి తగిన ట్రాకింగ్ వ్యవస్థలు, నిర్బంధ నిబంధనలను ఏర్పాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. వైరస్ వ్యాప్తి తగ్గితే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను దశలవారీగా సడలించుకోవాలని లేదంటే తిరిగి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ ను త్వరగా ఎత్తివేస్తే కరోనా వైరస్ వ్యాప్తిచెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్దోవ్ కూడా హెచ్చరించారు.

కాగా.. చాలా దేశాలు క్రమక్రమంగా లాక్ డౌన్ ఎత్తివేతకు సుముఖత చూపిస్తున్నాయి. జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలు లాక్ డౌన్ ను సడలించడం ప్రారంభించాయని, అమెరికాలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను ఎప్పుడు ఎలా ముగించాలో ప్రభుత్వాలు నిర్ణయించాలని, మహమ్మారి తగ్గిన తర్వాతే ఆంక్షలు సడలించాలని మైక్ ర్యాన్ సూచించారు. సరిగ్గా నెలరోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా 13,46,800 కరోనా కేసులుండగా, మే 6వతేదీ నాటికి కరోనా రోగుల సంఖ్య 37.8 లక్షలకు పెరిగింది. కరోనా వల్ల 2.61 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: తెలంగాణలో.. ‘మీ’ సేవలు షురూ 

Follow Us
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
వర్షం తర్వాత వచ్చే వాసన పోవాలంటే.. ఇలా చేయండి!
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
.. ఇలా పిండి కలిపితే మెత్తటి దూది లాంటి ఇడ్లీ సిద్ధం..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
బూడిద గుమ్మడికాయను ఇలా కడుతున్నారా? దిష్టి పోవాలంటే ఈ నియమాలు..
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి టాటా నెక్సాన్.. వివరాలివే
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి, తల్లి అప్పు తీర్చడానికి సినిమాల్లో
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?