ఈ కరోనా వేరియంట్ చాలా ప్రమాదకరం- డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్
అత్యంత వేగంగా వ్యాపించే ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా విలయం ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్లనూ..
అత్యంత వేగంగా వ్యాపించే ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా విలయం ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనాకు చెందిన B.1.617 వేరియంటే ఈ విపత్తుకు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీనిని తొలిసారి ఇండియాలోనే గతేడాది అక్టోబర్‌లో గుర్తించారు. దీనిని ఒక ప్రత్యేకమైన వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌వో కూడా ఈ మధ్య లిస్ట్ చేసింది. ఇప్పటి వరకూ కరోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయని, అందులో ఇదీ ఒకటని సౌమ్య చెప్పారు. అయితే దీనిని ఇప్పటి వరకూ ఆందోళన కలిగించే వేరియంట్‌గా మాత్రం డబ్ల్యూహెచ్‌వో గుర్తించలేదు. ఈ ముద్ర పడిందంటే ఇది ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని, చాలా ప్రమాదకరమైందని, వ్యాక్సిన్లనూ బోల్తా కట్టిస్తుందని అర్థం. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాలు దీనిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించగా.. త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో కూడా గుర్తిస్తుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.
సహజంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన యాంటీబాడీలను కూడా బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేషన్లు ఈ B 1.617 వేరియంట్‌లో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ చెప్పారు. అందుకే దీనిని ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించవచ్చని తెలిపారు. ఈ వేరియంట్‌దే మొత్తం బాధ్యత అని చెప్పలేమని, కరోనా వెళ్లిపోయిందని బాధ్యరహితంగా తిరిగారని, అందువల్లే ఈ విపత్తు అని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: తెలంగాణలోని ఈ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. కారణాలు ఏంటంటే