AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెల్లీ ఫిష్ అనుకుని తినబోయాడు, కానీ కొద్దిలో ప్రాణం కాపాడుకున్నాడు, ఆస్ట్రేలియాలో వింత, నెటిజెన్ల ఎద్దేవా

ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి ఇటీవల ఓ వింత అనుభవం కలిగింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిడ్నీ సముద్ర బీచ్ లో తిరుగుతుండగా అతనికి ఓ వింత జీవి కనిపించింది.

జెల్లీ ఫిష్ అనుకుని తినబోయాడు, కానీ కొద్దిలో ప్రాణం కాపాడుకున్నాడు, ఆస్ట్రేలియాలో  వింత, నెటిజెన్ల ఎద్దేవా
Jellyfish
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 09, 2021 | 7:15 PM

Share

ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి ఇటీవల ఓ వింత అనుభవం కలిగింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిడ్నీ సముద్ర బీచ్ లో తిరుగుతుండగా అతనికి ఓ వింత జీవి కనిపించింది. నీలి రంగులో పల్చగా ట్రాన్స్ పెరెంట్ గా ఉన్న దీన్ని చూడగానే అతనికి నోరూరింది. సాధారణ చేపలు, జెల్లీ ఫిష్ వంటివి అమితంగా ఇష్టపడే ఈ వ్యక్తి దాన్ని పట్టుకుని ఓ వీడియోలో.. చూడండి..త్వరలో దీన్ని తింటాను.. నా చేతుల్లో ఉన్న ఇది వింతగా ఉంది కదూ ! చల్లగా కూడా ఉంది..దీన్ని నాకబోతున్నా..’ అంటూ తెగ ఇదైపోయాడు. అయితే అప్పటికే ఆ సముద్ర జీవి చచ్చి పడి ఉండడంతో బతికిపోయాడు. అది చాలా హానికరమైనదిగా ఆ తరువాత తెలుసుకున్నాడు. నెటిజన్లు ఇక ఆ వ్యక్తితో ఓ ‘ఆట’ఆడుకున్నారు. నువ్వు బతికిపోయావు.. చాలా లక్కీ.. అది ఫ్లోటింగ్ టెర్రర్ అనే జెల్లీ ఫిష్ లాంటి ప్రమాదకరమైన జీవి.. దీన్నితింటే ప్రాణాలు దక్కవు అని ఒకరంటే.. దీన్నే బ్లూ బాటిల్ అని కూడా అంటారని, ఇందులో విషపూరిత కణజాలం ఉంటుందని, క్షణాల్లో మనిషిని విగత జీవిని చేసేస్తుందని మరో నెటిజన్ అన్నాడు. కొద్ది సేపట్లో దీన్ని నువ్వు తిని ఉంటే శ్వాస తీసుకోలేవని, ‘పోర్చుగీస్ మానోవర్’ అని కూడా వ్యవహరించే ఇది తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని మరో నెటిజనుడు అతడ్ని భయపెట్టేశాడు. దీంతో ఆ పెద్ద మనిషి ఇక జెల్లీ ఫిష్ జోలికి వస్తే ఒట్టు అని తనలో తాను అనుకుంటూ ఇంటిదారి పట్టాడట. కానీ నెటిజన్లే కాదు.. సముద్ర నిపుణులు కూడా ఆ తరువాత ఆ జలచరాన్ని పరీక్షగా చూసి నిజంగా ఇది చాలా ప్రమాదకరమైనదే అని తేల్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: curfew in vijayawada: కృష్ణా జిల్లాలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు పాటించ‌ని వారికి క‌ఠిన ప‌నిష్మెంట్.. మోకాళ్ల దండ వేయించి

రక్తంలో ఆక్సిజన్ తగ్గింతుందనే తెలిపే లక్షణాలు ఎంటో తెలుసా.. ఆక్జిజన్ స్థాయిలను పెంచడానికి ఇలా చేయండి..