AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తంలో ఆక్సిజన్ తగ్గింతుందనే తెలిపే లక్షణాలు ఎంటో తెలుసా.. ఆక్జిజన్ స్థాయిలను పెంచడానికి ఇలా చేయండి..

ఆక్జిజన్ కొరత.. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం.. ప్రాణవాయువుకు అధిక డిమాండ్.. ఇలాంటి మాటాలన్ని ప్రస్తుతం అధికంగా వింటున్నాం.

రక్తంలో ఆక్సిజన్ తగ్గింతుందనే తెలిపే లక్షణాలు ఎంటో తెలుసా.. ఆక్జిజన్ స్థాయిలను పెంచడానికి ఇలా చేయండి..
Oxgen
Rajitha Chanti
|

Updated on: May 09, 2021 | 7:06 PM

Share

ఆక్జిజన్ కొరత.. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం.. ప్రాణవాయువుకు అధిక డిమాండ్.. ఇలాంటి మాటాలన్ని ప్రస్తుతం అధికంగా వింటున్నాం. కరోనా వైరస్ పుణ్యమా అని ఆక్సిజన్ కొరత భూమ్మీద ఏ రెంజ్‏లో ఉందో అర్థమైపోతుంది. మనిషి మనుగడకు ముఖ్యంగా శ్వాస తీసుకోవడమనేది ప్రథమం. శరీరంలో రక్తప్రవాహం ద్వారా క్సిజన్‌ను ప్రసరింపచేస్తుంది. అలాగే శరీరంలోని అవయవాలు, కణాలు, కణాజాలాల సమతుల్య పనితీరుకు సహయపడుతుంది. రక్తంలో తగినంత ఆక్సిజన్ లేకపోతే దానిని హైపోక్సేమియా అంటారు. ఈ హైపోక్సేమియా తీవ్రంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితి కారణంగా అకస్మాత్తుగా సంభవించవచ్చు లేదా COPD వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి కారణంగా కూడా సంభవించవచ్చు. ఒకరి శరీరంలో రక్తంలో ఆక్సిజన్ కొరత ఉంటే, మన శరీరం మనకు అనేక విధాలుగా తెలియజేస్తుంది.

ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు మత్తుగా ఉండడం, తేలికపాటి తలనొప్పి ఉంటుంది. ఇవే కాకుండా.. దీర్ఘకాలిక అలసట, అనేక రకాల భావోద్వేగాలు కలుగుతుంటాయి. అయితే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నవారికి అలసట అనేది తొందరగా తగ్గిపోదు. అలాగే గుండె వేగంగా కోట్టుకోవడం, తీవ్రమైన ఆందోళన ఉండటం అనేవి జరుగుతుంటాయి. దీనికి కారణం శరీరంలోని అన్ని అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వలన ఇలా జరుగుతుంటుంది. ఇక అలాగే ఆక్సిజన్ తగ్గినప్పుడు శ్వాస ఆడకపోవడం… శ్వాస తీసుకోవడం ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. ఇక తీవ్రమైన తలనొప్పి ఉండడం, ఎక్కువగా గందరగోళంగా అనిపించడం జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయని అర్థం. అయితే ఈ సమస్యను కొన్ని రకాల ఆహార పదార్థాలతో నయం చేసుకోవచ్చు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. అవెంటో తెలుసుకుందామా.

ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచడంతో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చు. ఎక్కువగా గుడ్లు, గొడ్డు మాంసం, మటన్, చికెన్, టర్కీ మాంసం, పంది మాంసం, క్లామ్స్, రొయ్యలు, ట్యూనా, సెంట్రల్, మాకేరెల్, గుల్లలు, స్కాలోప్స్, టోపు, కిడ్నీ బీన్స్, చీక్ పీస్, బ్లాక్ బీన్స్, ప్లాట్ బీన్స్, పింటో బీన్స్, బచ్చలికూర, పాలకూర, డాండెలైన్ బచ్చలికూర, గేల్ పాలకూర, కొల్లార్డ్ పాలకూర, టమోటా, బటానీలు, చక్కెర దుంప, బ్రోకలీ, స్ట్రాబెరీలు, బేరి, అత్తి పండు, పొడి ద్రాక్, పొడి ప్రూనే, ఎండిన ఆప్రికాట్లు, పీచెస్, గోధుమ రొట్టె, పాస్తా, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న వంటివి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి.

Also Read: Mail Movie: అరుదైన ఘనత సాధించిన ‘మెయిల్’.. ఆ అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు సినిమా..

విజయ్ ఫ్యాన్స్‏కు బ్యాడ్ న్యూస్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయమే మంచిదంటూ పూరీ టీం ట్వీట్..