మీ పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడానికి ఇలాంటి ఆహార పదార్థాలను తినిపించండి.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే…
ప్రస్తుత పరిస్థితులలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. కరోనా సెకండ్ వేవ్ ఈసారి మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి
ప్రస్తుత పరిస్థితులలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. కరోనా సెకండ్ వేవ్ ఈసారి మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఇండియాకు త్వరలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే 18 ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న వారికి కరోనా నుంచి రక్షించుకోవడానికి టీకా ఇస్తున్నారు. మరీ పిల్లలకు. చిన్నారులకు వ్యాక్సినేషన్ వేయడం అనేది ఇంతవరకు ఆమోదించబడలేదు. ఇలాంటి సమయంలో వారిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహజ ఆహార పదార్థాలను ఇవ్వడం మంచిది. సాధారణంగా పిల్లలు ఏం తినాలన్న మారాం చేస్తుంటారు. ఇక వాళ్ళ అల్లరిని తట్టుకుంటూ.. ఇమ్యూనిటీ పెరిగే ఆహారాన్ని అందించడం అతి పెద్ద సవాలు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులలో వారిలో ఇమ్యూనిటీ పెరగడం తప్పనిసరి. కేవలం వారికి ఇచ్చే ప్రోటీన్స్ ఫుడ్తోనే ఇమ్యూనిటీని పెంచవచ్చు. మరీ ఎలాంటి ఆహారం పిల్లలకు ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందో తెలుసుకుందామా.
1. బాదం పప్పు…
ఇందులో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ మరింత బలంగా ఉండేందుకు సహయపడతాయి. అయితే మీ పిల్లలు ఇవి తినాలంటే బాదం పప్పు నానబెట్టి తొక్క తీసి స్నాక్స్ గా ఇవ్వండి లేదా బ్రేక్ ఫాస్ట్ లో స్మూతీలా ఇవ్వవచ్చు.
2. ఎగ్స్..
ఎగ్స్ తినడం వలన విటమిన్ డీ శరీరానికి అందుతుంది. విటమిన్ డీ తక్కువగా ఉండడం వలన పిల్లలు త్వరగా జబ్బుల బారిన పడతారు. ఈ విటమిన్ డీ సూర్య రశ్మి లేదా కొన్ని ఫుడ్స్ వల్ల లభిస్తుంది. గ్స్ లో బీ విటమిన్ ఈ, సెలీనియం ఉన్నాయి. ఎగ్స్ ని హార్డ్ బాయిల్డ్‌గా ఇవ్వవచ్చు, ఆమ్లెట్ తినిపించవచ్చు.
3. పాలకూర..
పాలకూరలో ఇమ్యూన్ సిస్టమ్‌ని బలపరిచే మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. పాల కూరలో విటమిన్స్ ఏ, సీ, ఈ, కే, ఫోలేట్, మాంగనీస్, జింక్, సెలీనియం, ఐరన్ ఉంటాయి. పాల కూర స్మూతీల్లో వాడడానికి వీలుగా ఉంటుంది.
4. పెరుగు.
ఇందులో ఉండే హెల్దీ బ్యాక్టీరియా గట్ హెల్త్‌ని కాపాడుతుంది. దీని వల్ల అనేక వ్యాధులు మనని దరి చేరకుండా ఉంటాయి. పెరుగు పిల్లలు తినాలంటే పెరుగన్నం తినిపించండి, లేదా దద్ధోజనం చేసినా ఇష్టంగానే తింటారు. కొంత మంది పిల్లలు పెరుగు తినరు కానీ మజ్జిగ అంటే ఇష్టంగా తాగుతారు, వారికి చిక్కని మజ్జిగ చేసి తాగించవచ్చు.
5. పప్పులు..
పప్పుల్లో ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. పప్పుల్లో ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరం రోగాల బారిన పడకుండా కాపాడతాయి. టమాటా పప్పు, దోసకాయ పప్పులా చేసి తినిపించండి. పెసలతో పెసరట్లు వేసి బ్రేక్ ఫాస్ట్ లో ఇవ్వండి.
6. సీడ్స్..
మీ పిల్లలకి అన్ని వెరైటీల సీడ్స్ ఇవ్వండి. గుమ్మడి విత్తనాలు, సన్ ఫ్లవర్ విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి ఇమ్యూనిటీ బూస్టింగ్‌గా పని చేస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల విటమిన్ ఈ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. వీటిని స్నాక్‌గా ఇవ్వండి. లేదా వీటిని స్మూతీల్లో ఇవ్వవచ్చు.
7. సిట్రస్ ఫ్రూట్స్..
కమలా పండు, బత్తాయి పండు, జామ పండు వంటి సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సీ సమృద్ధిగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతే కాక విటమిన్ సీ బాడీ పోషకాలని గ్రహించేందుకు అవసరమైన హెల్ప్ చేస్తుంది. వీటిని స్నాక్‌గా తినిపించండి, లేదా జ్యూస్ చేసి ఇవ్వండి.
8. పచ్చి బఠానీ..
పచ్చి బఠానీల్లో విటమిన్స్ ఏ, బీ1, బీ6, సీ ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరొటినాయిడ్స్, పాలిఫెనాల్స్ అన్నీ కలిసి ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తాయి. వీటిని ఏ కూరల్లో అయినా కలిపి ఉడికించి ఇవ్వవచ్చు.
Also Read: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా ? అయితే ఈ చిట్కాలతో ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందండిలా..