భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్ సేవల అఫీషియల్ వెబ్‌సైట్‌ పేరు మారుస్తూ టీటీడీ బోర్డు కీలక ప్రకటనను జారీ చేసింది. ఇప్పటివరకు స్వతంత్ర వెబ్‌సైట్‌గా ఉన్న దీన్ని ఇక నుంచి ప్రభుత్వంతో అనుసంధానం చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కళ్యాణ మండపాలు తదితర ఆన్లైన్ సేవలతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం కూడా కొత్త సైట్ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు https:/ttdsevaonline.com ఉన్న వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్చినట్లు […]

భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ వెబ్‌సైట్‌ పేరు మార్పు..
Follow us

|

Updated on: May 23, 2020 | 12:29 AM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్లైన్ సేవల అఫీషియల్ వెబ్‌సైట్‌ పేరు మారుస్తూ టీటీడీ బోర్డు కీలక ప్రకటనను జారీ చేసింది. ఇప్పటివరకు స్వతంత్ర వెబ్‌సైట్‌గా ఉన్న దీన్ని ఇక నుంచి ప్రభుత్వంతో అనుసంధానం చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కళ్యాణ మండపాలు తదితర ఆన్లైన్ సేవలతో పాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం కూడా కొత్త సైట్ ద్వారా భక్తులకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటివరకు https:/ttdsevaonline.com ఉన్న వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్చినట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. ఈ కొత్త వెబ్‌సైట్‌ ఇవాళ్టి నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దైవ దర్శనాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. మే 31తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో అప్పుడైనా ఆలయాలు తెరుచుకుంటాయో లేదో అన్నది వేచి చూడాలి.

Read More:

కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. జూన్‌ 20 నుంచి బీటెక్ పరీక్షలు..

రైల్వే ప్రయాణీకులకు మరో శుభవార్త…

తెలంగాణ పదో తరగతి పరీక్షలు.. మార్గదర్శకాలు ఇవే..