థానే జిల్లాలో మరణ మృదంగం.. ఒకేరోజు 36 మంది మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఒకేరోజు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 311కి చేరింది. గత 24 గంటల్లో 1,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Thane District COVID-19 Cases : మహారాష్ట్రలోని థానే జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఒకేరోజు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 311కి చేరింది. గత 24 గంటల్లో 1,561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 31,850కి చేరినట్టు వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం థానే నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,506కు చేరింది.
ఇక ముంబై చుట్టు ఉన్న మున్సిపల్ కారొరేషన్‌లలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. ఇందులో.. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలోని ప్రాంతాల్లో 6,427 కేసులు నమోదు కాగా… కళ్యాణ్ దొంబివలి మున్సిపలిటీ పరిధిలో కొవిడ్-19 కేసుల సంఖ్య 6,113కు చేరాయి. మీరా భాయాందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో మరో 124 కేసులు రావడంతో బాధితుల సంఖ్య 3,175కు చేరింది. ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. కొవిడ్-19 కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పనికి రాకుండా పోతున్నాయి.