జులై 5 నుంచి మరింత కఠినమైన లాక్‌డౌన్..!

వచ్చే నెల 5వ తేదీన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ముగియగానే.. ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ అమలులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి....

జులై 5 నుంచి మరింత కఠినమైన లాక్‌డౌన్..!
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2020 | 6:51 AM

Complete Lockdown on Sundays : కరోనా కట్టడికి మరోసారి కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఉన్నందున ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకుంది. వచ్చే నెల 5వ తేదీన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు ముగియగానే.. ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ అమలులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం సాయంత్రం జరిగిన కేబినేట్ మీటింగ్ లో చర్చించించినట్లుగా తెలుస్తోంది.

కరోనా దండయాత్రతో వీకెండ్ సెలువుల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా యడియూరప్ప ప్రకటించారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉంటుందని చెప్పారు. ఇదిలావుంటే.. జూలై 5 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు.

ప్రతిరోజు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. వారంలో ఐదురోజులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఆదివారం అత్యవసర సేవలు మినహా మొత్తం బంద్‌ అని ప్రకటించారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, బస్సులతో పాటు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు.