వాళ్లకు కరోనా టెస్ట్‌లు చేయబడవు…

ప్రయివేటు హాస్పిటళ్ల నుంచి వచ్చే వాళ్లకు కరోనా టెస్ట్‌లు చేయబడవంటూ కింగ్‌ కోఠి ఆస్పత్రిలో నోటీస్‌ అంటించారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారికి ప్రభుత్వ ల్యాబ్‌లో టెస్టులు చేయబడవని స్పష్టంగా పేర్కొన్నారు. చివరి క్షణాల్లో ప్రభుత్వాసుపత్రికి పంపిస్తున్నారు కాబట్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నారు. తెలంగాణలో ఈ ఒక్క రోజు 975 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 15వేల 394 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. 253 మంది […]

వాళ్లకు కరోనా టెస్ట్‌లు చేయబడవు...
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 30, 2020 | 6:46 AM

ప్రయివేటు హాస్పిటళ్ల నుంచి వచ్చే వాళ్లకు కరోనా టెస్ట్‌లు చేయబడవంటూ కింగ్‌ కోఠి ఆస్పత్రిలో నోటీస్‌ అంటించారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారికి ప్రభుత్వ ల్యాబ్‌లో టెస్టులు చేయబడవని స్పష్టంగా పేర్కొన్నారు. చివరి క్షణాల్లో ప్రభుత్వాసుపత్రికి పంపిస్తున్నారు కాబట్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నారు.

తెలంగాణలో ఈ ఒక్క రోజు 975 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో 15వేల 394 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి. 253 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 9వేల 559, డిశ్చార్టయిన వారి సంఖ్య 5వేల 582. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇవాళ 861 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.