చనిపోయిన వ్యక్తికి కరోనా.. ఊరంతా క్వారంటైన్.. !
యాదాద్రి జిల్లా బొమ్మల రామారారంలో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ యువకుడు చనిపోయిన తర్వాత పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు అధికారులు. చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. ముందు జాగ్రత్తగా యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారందరిని హోంక్వారంటైన్‌లో ఉండాలని జిల్లా వైద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా పేరు చెపితే చాలు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు మెల్లమెల్లగా గ్రామాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారారంలో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ యువకుడు చనిపోయిన తర్వాత పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు అధికారులు. మృతుడికి కరోనా ఉందన్న విషయం తెలియని గ్రామస్తులు అతడి అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు 500 మంది పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. ముందు జాగ్రత్తగా యువకుడి అంత్యక్రియలకు హాజరైన వారందరిని హోంక్వారంటైన్‌లో ఉండాలని జిల్లా వైద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా గ్రామం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.