ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం.. ధ్రువీకరణ పత్రం అందుకున్న మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సోమవారం ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం.. ధ్రువీకరణ పత్రం అందుకున్న మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సోమవారం ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఏపీ శాసనమండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ తరఫున మాణిక్య వరప్రసాద్‌ ఒక్కరే నామిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కాగా.. ఇవాళ నామినేషన్‌ ఉప సంహరణ గడువు పూర్తికావడంతో ఆయన గెలిచినట్టు రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ప్రకటించారు. దీంతో డొక్కాకు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. దీంతో శాసనమండలిలో వైసీపీ అధికారిక సభ్యుల సంఖ్య 10కి చేరింది.