వైద్యులపై ఉమ్మేస్తూ దాడి.. ఇది క్వారంటైన్‌లో ఉన్న”తబ్లిగీ” కార్యకర్తల తీరు..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా కరోనా మహమ్మారి వ్యాపించింది. ఇప్పటికే దేశంలో 1400కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మత ప్రార్ధనల సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే చాలా మందిని ట్రేస్ చేసి.. క్వారంటైన్‌కు తరలించారు. అయితే ఈ తబ్లిగీ జమాత్ కార్యకర్తల […]

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా కరోనా మహమ్మారి వ్యాపించింది. ఇప్పటికే దేశంలో 1400కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌లో జరిగిన సమావేశాలకు హాజరైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మత ప్రార్ధనల సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే చాలా మందిని ట్రేస్ చేసి.. క్వారంటైన్‌కు తరలించారు. అయితే ఈ తబ్లిగీ జమాత్ కార్యకర్తల తీరుతో వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీలోని ఆర్పీఎఫ్ బ్యారెక్‌తో పాటు డిజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్ ప్రాంతాల్లో ఈ తబ్లిగీ జమాత్ కార్యకర్తలను క్వారంటైన్‌లో ఉంచారు. అయితే వీరు వైద్యం చేసేందుకు వచ్చే డాక్టర్లపై ఉమ్మేస్తూ వికృత చేశ్టలకు దిగుతున్నారని నార్తర్న్ రైల్వే CPRO దీపక్ కుమార్ తెలిపారు. క్వారంటైన్ సెంటర్లో ఉంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ.. అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి ఇబ్బుందులు కలగజేస్తున్నారని.. తినడానికి ఆహారం ఇస్తే.. అది బాగులేదంటూ గొడవలకు దిగుతున్నారని తెలిపారు.