మహారాష్ట్ర…6 లక్షలమంది నేత కార్మికుల ఆకలి కేకలు.

లాక్ డౌన్ ఫలితంగా అన్నీ బంద్ కావడంతో మహారాష్ట్రలోని భివాండీ జిల్లాలో 6 లక్షల మంది చేనేత కార్మికులు చేతి నిండా పనిలేక అల్లలాడుతున్నారు. తినడానికి తిండి లేదు.. చేతిలో డబ్బుల్లేవు. ముంబైకి సుమారు 50 కి.మీ. దూరంలోని ఈ సిటీలో ఇప్పుడు చేనేత మగ్గాలు సైలెంట్ అయిపోయాయి. ఈ జిల్లాలో సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల మగ్గాలున్నాయి. కానీ కొన్ని రోజులుగా మూలనపడిపోయాయి. ఇటీవలి వరకు ప్రతి 15 రోజులకు సుమారు 4 […]

మహారాష్ట్ర...6 లక్షలమంది నేత కార్మికుల ఆకలి కేకలు.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 7:38 PM

లాక్ డౌన్ ఫలితంగా అన్నీ బంద్ కావడంతో మహారాష్ట్రలోని భివాండీ జిల్లాలో 6 లక్షల మంది చేనేత కార్మికులు చేతి నిండా పనిలేక అల్లలాడుతున్నారు. తినడానికి తిండి లేదు.. చేతిలో డబ్బుల్లేవు. ముంబైకి సుమారు 50 కి.మీ. దూరంలోని ఈ సిటీలో ఇప్పుడు చేనేత మగ్గాలు సైలెంట్ అయిపోయాయి. ఈ జిల్లాలో సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల మగ్గాలున్నాయి. కానీ కొన్ని రోజులుగా మూలనపడిపోయాయి. ఇటీవలి వరకు ప్రతి 15 రోజులకు సుమారు 4 వేల రూపాయల వేతనాన్ని సంపాదిస్తూ వఛ్చిన నేత కార్మికులంతా ప్రస్తుతం ఆకలి బాధకు గురవుతున్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతుందని,  కానీ  మొదట తాము ఆకలితో చనిపోతామని, ఆ తరువాతే కరోనా అని ఓ కార్మికుడు నిస్సహాయంగా చెప్పాడు. తమకు రేషన్ కూడా దొరకడం లేదని, వారం రోజులపాటు అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని మరో కార్మికుడు వాపోయాడు. ఇక ముంబై నగరంలో బిజినెస్ లేక, కస్టమర్లు లేక అనేక రెస్టారెంట్లు కూడా మూత బడుతున్నాయి. ఏప్రిల్ 14 తరువాత కూడా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఓ రెస్టారెంట్ యజమాని దీనంగా వ్యాఖ్యానించాడు.