Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.15 లక్షలకు పెరుగుతుందా..? కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత వైద్య సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల పథకాలతో సంబంధం లేకుండా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందోచ్చు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలందరికీ వైద్య సహాయం అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రేషన్ కార్డు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలు అనారోగ్యానికి గురైతే ఈ పథకం ద్వారా ప్రైవేట్ వైద్య సౌకర్యం అందిస్తోంది. ఒక్కొ కుటుంబం రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. ఇక 70 ఏళ్లు దాటినవారికి రూ.10 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తోంది. ఇటీవలే వయో వృద్దులకు రూ.5 లక్షల లిమిట్ అదనంగా పొడిగించింది. అయితే ఈ లిమిట్‌పై చాలమందిలోనూ అయోమయం నెలకొంది. దీంతో ప్రభుత్వం స్పందించి అనుమానాకు తెరదించింది.
వృద్దులకు అదనంగా రూ.5 లక్షలు
ప్రస్తుతం ఒక్కొ కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తుండగా.. 2024 అక్టోబర్‌లో కుటుంబ ఆర్ధిక పరిస్థితి, ఆదాయంతో సంబంధం లేకుండా వయోవృద్దులకు మరో రూ.5 లక్షలు పెంచింది. అయితే ఆయుష్మాన్ భారత్ పథకంలోకి వచ్చే 70 ఏళ్లు దాటిన వృద్దులకు అదనంగా మరో రూ.5లక్షల కవరేజీ ఉంటుంది. దీంతో వృద్దులకు రూ.10 లక్షల వరకు కవరేజీ వచ్చింది. అయితే కుటుంబంలో ఎక్కువమంది వృద్దులు ఉన్నప్పుడు కన్ ప్యూజన్ ఏర్పడుతుంది. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు నానతరపు పేరెంట్స్‌కి రూ.5 లక్షలు, అమ్మతరపువారికి రూ.5 లక్షలు వస్తుందని, కుటుంబానికి వ్యక్తిగతంగా ఉండే రూ.5 లక్షల లిమిట్ కలుపుకుంటే అందరికీ రూ.15 లక్షలు వస్తుందని భావిస్తున్నారు.
కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది
ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. వయ వందన పథకం క్రింద కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే కవరేజీ వస్తుందని, ఒక్కొక్కరికీ రాదని కేంద్రం తెలిపింది. మిగతవారు అందరికీ రూ.5 లక్షల లిమిట్ మాత్రమే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. దీనిపై ఎలాంటి అనామానాలు ఉన్నా ఆయుష్మాన్ భారత్ పోర్టల్‌లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.
