Nonveg Delivery Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ప్రాంతంలో నాన్‌వెజ్ ఫుడ్‌డెలివరీపై నిషేదం!
పవిత్ర పుణ్యక్షేత్రం ఆయోద్య రామ మందిరం పరిసర ప్రాంతాల్లో మాంసాహారం విక్రయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రామ మందిర ఆలయానికి చుట్టూ 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా మాంసాహార ఆహార పదార్థాల డెలివరీ చేయవద్దని.. ఆ ప్రాంతాల్లో పూర్తిగా మాంసాహారా ఆహారం డెలివరీని నిషేదిస్తూ జిల్లా పరిపాలన అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అయోధ్యలోని రామందిర పరిసర ప్రాంతాలల్లో మాంసాహార పదార్థాల డెలివరీని నిషేదిస్తూ జిల్లా పిరిపాలనా అధికారలు శుక్రవారం కీలక ఉత్తర్వులను జారీ చేశారు. అయోధ్యలోని పంచకోశి పరిదక్షిణ పరిధిలో గత కొంత కాలంగా ఆన్‌లైన్‌లో మాంసాహార ఆహారాన్ని డెలివరీ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయని.. రోజురోజుకూ ఈ ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్స్‌లలో పర్యాటకులకు మాంసాహారం, మద్యం వంటి వాటినికి కూడా అందుబాటులో ఉంచుతున్న తమకు సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.
అయితే గతేడాది మేలోనే అయోధ్య-ఫైజాబాద్‌లను కలిపే 14 కి.మీ రామ్ పాత్ వెంబడి మద్యం, మాంసం అమ్మకాలను నిషేధించాలని అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, గడిచిన తొమ్మిది నెలల్లో మద్యం అమ్మకాలపై ఎలాంటి నిషేధం అమలు కాలేదని.. చాలా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన మున్సిపల్ శాఖ ఫైజాబాద్‌లోని రోజ్‌తో సహా రామ్ పాత్ వెంబడి ఉన్న మాంసం దుకాణాలను తొలగించిందని, కానీ మద్యం దుకాణాలపై చర్య తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం అనుమతి అవసరమని తెలిపింది. దీంతో స్థానికులు ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
తాజాగా ఈ అంశంపై అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ స్పందిస్తూ.. నిషేధం ఉన్నప్పటికీ రామ్ పాత్ వెంబడి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పర్యాటకులకు మాంసాహార ఆహార పదార్థాలను డెలివరీ అవుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ మాంసాహార ఆహార డెలివరీపై నిషేధం విధించినట్టు స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న అన్ని హోటల్స్, డెలివరీ సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేశామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
