AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వూహాన్ మరణాలపై “డైలీ మెయిల్” సంచలన కథనం.. అక్కడి జనం మాట ఏంటంటే..?

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి.. చైనాలోని వూహాన్ పట్టణంలో పురుడు పోసుకుందన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఆ పట్టణంలో కరోనా మహమ్మారి లేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఇంకా కరోనాతో అతలాకుతలమవుతున్నాయి. అయితే చైనాలో కరోనా వైరస్‌ కట్టడి చేశామని.. ఇక్కడ కేవలం మూడు వేల మూడు వందల మంది చనిపోయారని చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవానికి అక్కడ చనిపోయింది ఎక్కువ అంటున్నారని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే […]

వూహాన్ మరణాలపై డైలీ మెయిల్ సంచలన కథనం.. అక్కడి జనం మాట ఏంటంటే..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 30, 2020 | 7:39 PM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి.. చైనాలోని వూహాన్ పట్టణంలో పురుడు పోసుకుందన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఆ పట్టణంలో కరోనా మహమ్మారి లేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఇంకా కరోనాతో అతలాకుతలమవుతున్నాయి. అయితే చైనాలో కరోనా వైరస్‌ కట్టడి చేశామని.. ఇక్కడ కేవలం మూడు వేల మూడు వందల మంది చనిపోయారని చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవానికి అక్కడ చనిపోయింది ఎక్కువ అంటున్నారని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అంతా అనుకున్నట్లే ఇక్కడ మూడు వేల కాదు.. ఏకంగా నలభై రెండు వేలకు పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ సంచలన విషయాలను డైలీ మెయిల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. చైనాలోని వూహాన్ పట్టణంలోనే ఏకంగా 42,000 మందికి పైగా ఈ మహమ్మారికి బలైపోయినట్లు తెలిపారట.

మరోవైపు అక్కడి ప్రభుత్వం మాత్రం కేవలం 3300 మంది మాత్రమే మరణించారని చెబుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. మృతుల గురించి పూర్తిగా దర్యాప్తు జరగలేదని.. లెక్కకు మించిన జనం.. వారి వారి ఇళ్లలోనే మరణించారని చెబుతున్నారుట. కేవలం ఒక్క నెలలోనే 28 వేల మృతదేహాలను దహనం చేశారన్న వార్తలు కూడా వినిపించాయట.

కాగా వూహాన్ పట్టణంలోని మృతులకు సంబంధించి.. నిత్యం 500 ఆస్తికల కలశాలను మృతుల బంధువులకు ఇస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారట. ఈ విధంగా 12 రోజుల్లో దాదాపు 42 వేల అస్తికలు కలశాలను వారి వారి బంధువులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చైనాలో అసలు ఏం జరిగిందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు చైనానే ఈ వైరస్‌ను ప్రపంచంపై వదిలిందంటూ కూడా పలుదేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు