Cinema : ఆ సినిమాకు రూ.35 లక్షలు పెడితే 9 లక్షలు వచ్చాయి.. నిర్మాత స్రవంతి కిషోర్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాంటి వాటిలో మహర్షి సినిమా ఒకటి. 1987లో విడుదలైన ఈ సినిమా తీవ్ర నష్టాన్ని మిగుల్చిందని ఇటీవల నిర్మాత స్రవంతి రవికిశోర్ తెలిపారు.

సినీ నిర్మాణ రంగంలో సక్కెస్ కావడం అంటే మాములు విషయం కాదు.. భారీ అంచనాల మధ్య విడుదలై పెట్టుబడి కూడా రాని సినిమాలు చాలా ఉన్నాయి. సినిమా హిట్టైతే ఒకే.. కానీ ప్లాప్ అయితే .. ఆ సినిమా నిర్మాతను ఎవరూ ఆదుకోలేని స్థాయిలో నష్టపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి తనకు ఎదురైందని అంటున్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 1987లో వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రానికి 35 లక్షల రూపాయలు ఖర్చయిందని, అందులో 25 లక్షలు నష్టం వచ్చిందని తెలిపారు. ఆ కాలానికి ఈ సినిమా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండటం, పెళ్లి అయిపోయిన అమ్మాయి వెనుక ప్రేమికుడు తిరగడం వంటి కథాంశాన్ని అప్పటి ప్రేక్షకులు ఆదరించలేదని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
స్రవంతి రవికిషోర్ తన రెండవ చిత్రంగా వంశీ దర్శకత్వంలో మహర్షిని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణానికి 35 లక్షల రూపాయలు ఖర్చయిందని, అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమని ఆయన తెలిపారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయిందని, దాదాపు 25 లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చిందని ఆయన వెల్లడించారు. సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం, పాటలు అద్భుతమైన ప్రజాదరణ పొందాయని, ఇప్పటికీ ఆ పాటలు వినని ఇల్లు ఉండదని రవికిషోర్ అన్నారు. అయినప్పటికీ, సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడానికి కారణం అది 1987 నాటి ప్రేక్షకులకు “చాలా అడ్వాన్స్‌డ్” కథాంశం కావడమేనని అభిప్రాయపడ్డారు. “పెళ్లి అయిపోయిన ఒక అమ్మాయి వెనకాల ప్రేమించిన వాడు తిరగటం” అనే అంశాన్ని అప్పటి సమాజం అంగీకరించే స్థితిలో లేదని అన్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
మహర్షి వైఫల్యం ఆర్థికంగా పెద్ద దెబ్బ అయినప్పటికీ, రవికిషోర్ ధైర్యం కోల్పోలేదు. ఆయన తన కెరీర్‌ను ఒక “జెయింట్ వీల్” ప్రయాణంగా భావించారు.. లేడీస్ టైలర్ విజయం తర్వాత తాను పైకి సక్సెస్ అయినప్పటికీ, మహర్షి సినిమా తనను పాతాళానికి నెట్టిందని అన్నారు.. అయితే, ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించాలంటే ఆర్థిక బలం అవసరమని ఆయన అన్నారు.. ఈ అనుభవం తర్వాత ఆయన నాయకుడు (నాయగన్) వంటి తమిళ చిత్రాల తెలుగు డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసి, ఇక్కడ విడుదల చేసే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, పుష్పక విమానం వంటి ప్రయోగాత్మక చిత్రాలను కూడా విడుదల చేశారు.
కంటిన్యూస్ ఫెయిల్యూర్‌లు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రవికిషోర్ తన మామ గారి సలహా మేరకు బ్యానర్ పేరును చంద్రకిరణ్ ఫిలిమ్స్గా మార్చారు. . ఈ బ్యానర్ కింద తన భార్య ఉషారాణిని నిర్మాతగా పరిచయం చేసి, వరుసగా ఐదు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
