పదేపదే వేడి చేసిన నూనెలో విష పదార్థాలు, ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇవి కణాలను నాశనం చేసి, ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్గా మారతాయి. అక్రోలిన్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ క్యాన్సర్, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. జీర్ణ సమస్యలు, లివర్ వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి, వాడిన నూనెను తిరిగి వాడటం ప్రమాదకరం.