School Reopen: స్కూళ్లను తెరవాల్సిందే.. కీలక వ్యాఖ్యలు చేసిన యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
School Reopen: కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఏకంగా రెండు అకడమిక్ ఇయర్స్‌పై ఈ వైరస్ ప్రభావం పడింది. ఇది ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు...
School Reopen: కరోనా (Coronavirus) మహమ్మారి కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఏకంగా రెండు అకడమిక్ ఇయర్స్‌పై ఈ వైరస్ ప్రభావం పడింది. ఇది ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు. కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని దేశాల విద్యా సంస్థలపై పడింది. అన్ని దేశాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలను మూసేశారు. పై తరగుతుల వారికి ఆన్‌లైన్ క్లాస్‌లు జరుగుతున్నా కింది తరగతుల విద్యార్థులు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. సెకండ్ వేవ్ తర్వాత కొంచెం ఉపశమనం కనిపించినా ఇప్పుడు మరోసారి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇదిలా ఉంటే విద్యా సంస్థల మూసివేతపై యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఇలాంటి తరుణంలో విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా ప్రభుత్వాలు తమ శక్తి మేర కృషి చేయాలని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ని రోజులు విద్యా సంస్థలను మూసివేసింది చాలని, ఇకపై పాఠశాలలు తిరిగి తెరవాల్సిందేనని ఆయన అన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా విద్యా సంస్థల పునఃప్రారంభం కోసం యూనిసెఫ్ ఒక ఫ్రేమ్ వర్క్‌ను అభివృద్ధి చేసింది ఫోర్ చెప్పుకొచ్చారు.
ప్రతి విద్యార్థి శ్రేయస్సును కూడా ప్రాధాన్యత తీసకుంటూనే విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు. కరోనా మహమ్మారి పంజా విసురుతోన్న సమయంలో విద్యార్థులను తిరిగి పాఠశాలలకు రప్పించడానికి కచ్చితంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి ఇందుకోసం టీచర్లతో పాటు స్టాఫ్ కచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఫోర్ తెలిపారు. ఇక పిల్లలకు టీకాను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డ ఫోర్ వారికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే కరోనా థార్డ్ వేవ్ ఎంటర్ అయిన తర్వాత భారత్‌లో మూత పడ్డ విద్యా సంస్థలను పునఃప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు, ఛండీఘడ్, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కోవిడ్ 19 ప్రోటోకాల్స్‌ను అనుసరించి ఫిబ్రవరి 1నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభిచాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించాయి. పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోన్న క్రమంలో త్వరలోనే దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: SBI Recruitment: మహిళా కమిషన్ దెబ్బకు రిక్రూట్‌మెంట్ రూల్స్ మార్చిన ఎస్‌బీఐ.. ఇకపై వారు అర్హులే..
Tamannaah: సోషల్ మీడియాలో తమన్నా డ్యాన్స్ ఛాలెంజ్.. ఆ స్టెప్స్ వేయడం కష్టమే.. మీరు ట్రై చేయండి..