SBI Recruitment: మహిళా కమిషన్ దెబ్బకు రిక్రూట్‌మెంట్ రూల్స్ మార్చిన ఎస్‌బీఐ.. ఇకపై వారు అర్హులే..
Delhi Commission For Women: కొత్త రిక్రూట్‌మెంట్‌లు లేదా ప్రమోషన్‌ల కోసం SBI తన కొత్త మెడికల్ ఫిట్‌నెస్ మార్గదర్శకాలలో మూడు నెలల కంటే తక్కువ గర్భవతి అయిన మహిళా..
SBI Recruitment New Rules: ఎస్‌బీఐ(SBI) రిక్రూట్‌మెంట్ రూల్స్(Recruitment New Rules)లో కొన్ని వివక్షపూరితంగా ఉన్నాయంటూ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో భారతీయ ప్రభుత్వ రంగ బ్యంక్‌కు షాక్ తగిలింది. తాత్కాలికంగా అనర్హులంటూ మూడు, ఆపై నెలల గర్భిణీ స్త్రీలను రిక్రూట్‌మెంట్ నుంచి తప్పించడం తప్పని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) SBIకి నోటీసు జారీ చేసింది. ఇది వివక్ష, చట్టవిరుద్ధం అని DCW చీఫ్ స్వాతి మలివాల్ పేర్కొన్నారు. దీంతో దిగొచ్చిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గర్భిణీ స్త్రీల అభ్యర్థుల నియామక నిబంధనలను మార్చింది. బ్యాంక్ మార్చిన నిబంధనల మేరకు, కొత్త రిక్రూట్‌మెంట్ విషయంలో మూడు, ఆపై ఎక్కువ నెలల గర్భవతిగా ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులుగా పరిగణించనున్నారు. డెలివరీ అయిన నాలుగు నెలలలోపు వారు జాబ్‌లో జాయిన్ కావొచ్చని తెలిపింది.
కొత్త రిక్రూట్‌మెంట్‌లు లేదా ప్రమోషన్‌ల కోసం SBI తన కొత్త మెడికల్ ఫిట్‌నెస్ మార్గదర్శకాలలో మూడు నెలల కంటే తక్కువ గర్భవతి అయిన మహిళా అభ్యర్థులను ‘ఫిట్’గా పరిగణిస్తామని పేర్కొంది. డిసెంబర్ 31, 2021న బ్యాంక్ జారీ చేసిన ఫిట్‌నెస్ ప్రమాణాల ప్రకారం గర్భం మూడు నెలలు దాటితే, ఒక మహిళా అభ్యర్థి తాత్కాలికంగా అనర్హులుగా పరిగణించేవారు. ఈ పరిస్థితిలో వారు బిడ్డ పుట్టిన తర్వాత నాలుగు నెలల్లో చేరడానికి అనుమతించవచ్చు.
ఫిబ్రవరి 1, 2022 నుంచి కస్టమర్ల కోసం SBI కొత్త రూల్.. ఇది కాకుండా, SBI తన వినియోగదారుల కోసం వచ్చే ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనను కూడా తీసుకురాబోతోంది. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత ఖాతాదారులకు నగదు బదిలీ భారం కానుంది. SBI వెబ్‌సైట్ ప్రకారం, బ్యాంక్ ఫిబ్రవరి 1, 2022 నుంచి IMPS లావాదేవీలలో కొత్త స్లాబ్‌ను చేర్చింది. ఈ శ్లాబు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల రూపాయల వరకు వర్తించనుంది. ఫిబ్రవరి 1 నుంచి IMPS ద్వారా రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య బ్యాంకు శాఖ నుంచి నిధులను బదిలీ చేయడానికి రూ. 20తో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: APPSC Jobs: ఏపీ నిరుద్యోగులకు మరో అవకాశం.. గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణకు గడువు..
AP Jobs: కడప జిల్లాలో మెడికల్ పోస్టుల భర్తీ.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?