Tamannaah: సోషల్ మీడియాలో తమన్నా డ్యాన్స్ ఛాలెంజ్.. ఆ స్టెప్స్ వేయడం కష్టమే.. మీరు ట్రై చేయండి..
మిల్కీ బ్యూటీ తమన్నాకు (Tamannaah) యూత్‌లో ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సుధీర్ఘ కాలంగా అగ్రకథానాయికగా తెలుగు చిత్రపరిశ్రమలో
మిల్కీ బ్యూటీ తమన్నాకు (Tamannaah) యూత్‌లో ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సుధీర్ఘ కాలంగా అగ్రకథానాయికగా తెలుగు చిత్రపరిశ్రమలో దూసుకుపోతుంది ఈ మిల్కీబ్యూటీ.. యంగ్ హీరోయిన్స్ రావడంతో అవకాశాలను అందుకోవడంలో కాస్త వెనకబడిన ఈ చిన్నది ఇప్పుడు.. మళ్లీ స్పీడ్ పెంచింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. ఐటెం సాంగ్స్‌తోనూ సత్తా చాటుతోంది. అంతేకాదు.. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ట్రో (Maestro) సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది. పూర్తి నెగిటివ్ షెడ్లో కనిపించి ప్రశంసలు అందుకుంది తమన్నా. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తెగ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తమన్నా.. సోషల్ మీడియాలో సరికొత్త డ్యాన్స్ ఛాలెంజ్ తీసుకువచ్చింది.
ఇట్స్ యువర్ టర్న్ అంటూ నెట్టింట్లో ఓ వీడియోతో అందరినీ ఉత్సాహపరుస్తోంది ఈ బ్యూటీ. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గని సినిమా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 16న విడుదలైన కొడ్తే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాటకు తనలాగే పెప్పీ సాంగ్ స్టెప్ వేయాలంటూ అందరిని ఆహ్వానించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా.. మరిన్ని అవకాశాలు తీసుకోండి.. మరిన్ని డ్యాన్స్ చేయండి.. నేను #కొడ్తే బీట్ కు డ్యాన్స్ చేస్తున్నాను. ఇది మీ వంతు అంటూ ఆ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం తమన్నా.. వెంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న ఎఫ్ 3 మూవీలో నటిస్తోంది.
View this post on Instagram
Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..