పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
ప్రస్తుతం లాక్‌డౌన్ కావడంతో.. ప్రజలు రోడ్ల మీదకు రావడం తగ్గింది. ఈ సమయాన్ని అధికారులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణమౌతున్న బ్రిడ్జీల నిర్మాణాలను వేగవంతం చేసింది. అందులో పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఒకటి. చాలా మంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల...

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ వర్షం పడితే ఇక అంతే. దాదాపు మూడు, నాలుగు గంటలు ఇరుక్కుపోవాల్సిందే. ఇంకా ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో తెలంగాణ సర్కార్ పలు చర్యలు తీసుకుంటోంది. అందులోనూ ప్రస్తుతం లాక్‌డౌన్ కావడంతో.. ప్రజలు రోడ్ల మీదకు రావడం తగ్గింది. ఈ సమయాన్ని అధికారులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణమౌతున్న బ్రిడ్జీల నిర్మాణాలను వేగవంతం చేసింది. అందులో పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఒకటి. చాలా మంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, ఉప్పల్ వైపు వెళుతుంటారు. అయితే ఇప్పుడు వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
పంజాగుట్టలో రెండు లేన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణం కూడా పూర్తయింది. రూ.5.95 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీ అధికారులు పనులు చేపట్టారు. పంజాగుట్ట చట్నీస్ హోటల్ ముందు నుంచి శ్మశానవాటిక మీదుగా చౌరస్తా వరకు 110 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. కాగా స్టీల్ బ్రిడ్జి పొడవు 43 మీటర్లు ఉంది. ఇరువైపులా అప్రోచ్‌లు 67 మీటర్లు. ఇక ఏడు మీటర్ల వెడల్పులో ఒక మీటరు పుట్‌పాత్‌కు కేటాయించారు. కాగా ప్రస్తుతం నిర్మాణం పూర్తయి.. ప్రారంభోత్సవానికి ఈ బ్రిడ్జ్ సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
Read More:
డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు
ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం..



