షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్

ప్రపంచంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 170 కోట్ల మంది ప్రజలకు కరోనా ముప్పు తప్పదని అంటున్నారు నిపుణులు. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు...

షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 10:23 AM

ప్రపంచంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 170 కోట్ల మంది ప్రజలకు కరోనా ముప్పు తప్పదని అంటున్నారు నిపుణులు. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన నివేదికని.. ప్రఖ్యాత లాన్సెట్ గ్లోబల్ హెల్త్ మ్యాగజైన్ ప్రచురించింది. అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో 22 శాతం మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస కోశ వ్యాధులు, టైప్ 2 డయాబెటీస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా ముప్పు ఎక్కువని అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధుల్లో ఏ ఒక్కటి ఉన్నా వారికి.. కోవిడ్ సోకితే చాలా ప్రమాదంలో పడతారని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్లోబల్ ఆఫ్ డిసీజెస్, వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన గణాంకాల్ని విశ్లేషించి ఎంత మంది ఈ వైరస్ బారిన పడతారో శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు.

కాగా ప్రపంచ జనాభాలో 34.9 కోట్ల మంది అంటే నాలుగు శాతానికి పైగా జనాభాకి వైరస్ సోకితే ఆస్పత్రిలో చేర్చించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ పేర్కొంది. ఇక 20 ఏళ్ల లోపు ఉన్నవారు 5 శాతం, 70 ఏళ్లకు పై బడిన వారు 66 శాతం మంది ఉన్నారు. పురుషుల్లో 6 శాతం మంది, మహిళల్లో 3 శాతం మందికి ముప్పు అధికంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం మరింతగా కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా మంగళవారం 141377 కొత్త కేసులు రావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 82,50,004కి చేరాయి. అలాగే నిన్న 4379 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటి.. 4,45,174కి చేరింది. ఇక ప్రస్తుతం 3505670 యాక్టీవ్ కేసులు ఉండగా, రికవరీ కేసుల సంఖ్య 4299200గా ఉంది.

Read More: 

డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..