AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మృతులపై ట్రంప్ లెక్క.. రెండు లక్షలైనా ….

ఏప్రిల్ 12 (ఈస్టర్) నాటికి ఈ కరోనా క్రైసిస్ సమసిపోవచ్ఛునని మొదట పేర్కొన్న ఆయన.. అంతలోనే ఇది పీక్ దశకు చేరుకొవచ్చునని కూడా అన్నారు. కరోనా మరణాలను నియంత్రించడానికి, ఈ వైరస్ నివారణకు ట్రంప్ ప్రభుత్వం లాక్ డౌన్.

కరోనా మృతులపై ట్రంప్ లెక్క.. రెండు లక్షలైనా ....
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 30, 2020 | 4:59 PM

Share

తమ దేశంలో కరోనా మృతుల సంఖ్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేలిగ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ దేశంలో మృతుల సంఖ్య  వెయ్యి నుంచి రెండు వేలకు పైగా  చేరుకున్నా ఆయనకు చీమ కుట్టినట్టయినా లేదు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయవంతమైన కారణంగానే మరణాలను నియంత్రించగలుగుతున్నామని ఆయన చెప్పారు. మేము గట్టి చర్యలు తీసుకోకపోయిఉండిఉంటే ఇప్పటికే 20 లక్షల మందికి పైగా మరణించి ఉండేవారని ఆయన అన్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా సామాజిక  దూర సంబంధ ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తునట్టు ఆయన ప్రకటించారు. మరణాల సంఖ్యను కేవలం పది వేలకు పరిమితం చేయగలిగితే ఈ దేశం బాగుపడినట్టే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘మేం తీసుకున్నపకడ్బందీ చర్యలు సుమారు ఇరవై లక్షల మందిని కాపాడాయి’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు లక్షా 32 వేలకు పైగా పెరగగా.. మృతుల సంఖ్య 2,355 కి చేరింది.

ఏప్రిల్ 12 (ఈస్టర్) నాటికి ఈ కరోనా క్రైసిస్ సమసిపోవచ్ఛునని మొదట పేర్కొన్న ఆయన.. అంతలోనే ఇది పీక్ దశకు చేరుకొవచ్చునని కూడా అన్నారు. కరోనా మరణాలను నియంత్రించడానికి, ఈ వైరస్ నివారణకు ట్రంప్ ప్రభుత్వం లాక్ డౌన్ వంటి చర్యలేవీ చేపట్టకపోవడం గమనార్హం. కరోనా చికిత్సలో వాడే వైద్య పరికరాలు, ఇతర సాధనాల కొనుగోలుకు, ఆయా ఆస్పత్రుల నిర్వహణకు, వాటి వైద్య సంబంధ సామర్త్యాన్ని పెంచడానికి, రోగులకు సేవ లందించే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సంక్షేమానికి ట్రంప్ ప్రభుత్వం కోట్లాది డాలర్ల ప్యాకేజీనైతే ప్రకటించింది గానీ.. కరోనా రాకాసికి గురైన ప్రపంచ దేశాల్లో ఇటలీని అమెరికా మించిపోయిందనే అప్రదిష్టను మాత్రం మూటగట్టుకుంది.