ముంబై క్వారంటైన్ లో 15 లక్షల మంది..
కరోనా మహమ్మారి భారత దేశ ఆర్ధిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ముంబైవాసులు వణుకుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షలకు...
Over 15 Lakh Quarantined in Mumbai : కరోనా మహమ్మారి భారత దేశ ఆర్ధిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ముంబైవాసులు వణుకుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వైరస్ బారీన పడగా.. 9 వేల మందికి పైగా చనిపోయారు. ముంబైలో మొత్తం 15లక్షలకు పైగా ప్రజలు క్వారంటైన్‌లో ఉన్నట్లు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.
వీరిలో 5.34లక్షల మందిని ఎక్కువ ప్రమాదం ఉన్న కాంటాక్టులుగా గుర్తించినట్లు బీఎంసీ ప్రకటించింది. అయితే, నిర్బంధంలో ఉన్న వారిలో ఇప్పటికే 18.28లక్షల మంది 4రోజుల క్వారంటైన్ గడువును పూర్తిచేసుకున్నారని తెలిపింది. వీరంతా మరికొద్ది రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే గతంలో కంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుతున్నదని అక్కడి అధికారులు వెల్లడించారు.