మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఒక్కరోజే కొత్తగా 5,134..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 5,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి..

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఒక్కరోజే కొత్తగా 5,134..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 08, 2020 | 1:14 AM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 5,134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,121కి చేరింది. ఇక వీటిలో ప్రస్తుతం 89,294 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,296 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ అయిన వారి సంఖ్య 1,18,558కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 224 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 9,250కి చేరింది.

ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పుణె నగరంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక ముంబైలోని మురికి వాడ ధారవిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 2,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 352 మంది కరోనాతో పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వెల్లడించింది.