ఈ మైసూర్‌పాక్ తింటే ‘కరోనా’ తగ్గుతుందట..!

కోయంబత్తూర్ చిన్నియం పాళయంలో తమ షాపులో దొరికే ‘హెర్బల్ మైసూర్‌పాక్’ తినడంతో కోవిడ్ నుంచి భయటపడొచ్చని ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అంతేకాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో....

ఈ మైసూర్‌పాక్ తింటే 'కరోనా' తగ్గుతుందట..!
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 08, 2020 | 9:57 AM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే… మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. ఇదిలావుంటే తమిళనాడు రాష్ట్రంలో ఓ స్వీట్ షాప్ యజమాని తమ దగ్గర కొవిడ్ రక్కసికి మందు ఉందని ప్రకటన ఇచ్చుకుంది. ఈ వార్త ఆ నోట.. ఈ నోట రాష్ట్రం మొత్తం ప్రచారం జరగడంతో ఈ షాపు  వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

కోయంబత్తూర్ చిన్నియం పాళయంలో తమ షాపులో దొరికే ‘హెర్బల్ మైసూర్‌పాక్’ తినడంతో కోవిడ్ నుంచి బయటపడొచ్చని ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అంతేకాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసముంటున్న వారి నుంచి కూడా చాలా మంచి ఫీడ్‌బ్యాక్ కూడా తమకు వస్తోందని కూడా ఆ షాపు ప్రకటించుకుంది.

కరోనా పాజిటివ్ లక్షణాలున్న వారందరూ ఉచితంగా పొందవచ్చని ఆ షాపు యాజమాన్యం మరో ప్రకటన ఇచ్చింది. ఈ ‘హెర్బల్ మైసూర్ పాక్’ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని యజమానులు ప్రకటించారు.

చిన్నియం పాళయం, వెల్లూరు ప్రాంతాల్లో ఈ ప్రచారం ఎంతకూ తగ్గకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. అసలు ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు.. ఇందులో నిజమెంతో తేల్చే పనిలో పడ్డారు.