‘కరోనా ఫ్రీ’గా ప్రకటించిన వారంలోనే.. ఆ దేశంలో కొత్త కేసులు
కరోనాపై పోరులో విజయం సాధించామని ప్రకటించిన న్యూజిలాండ్‌లో మరోసారి ఆ వైరస్ కలకలం రేపింది. ఆ దేశంలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి.
కరోనాపై పోరులో విజయం సాధించామని ప్రకటించిన న్యూజిలాండ్‌లో మరోసారి ఆ వైరస్ కలకలం రేపింది. ఆ దేశంలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. యూకే నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన వారికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఈ ఇద్దరిని క్వారంటైన్ కేంద్రంలో 24 రోజుల పాటు ఉంచి ఇంటికి పంపిన తరువాత కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మరోసారి ఆ దేశాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఇద్దరు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారో గుర్తించే పనిలో పడ్డారు.
కాగా కరోనాను జయించామని ఈ నెల 8న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. అయితే ఈ గెలుపు తాత్కాలికమేనని, అందరూ అలర్ట్‌గా ఉండాలని జెసిండా ఆ సమయంలోనే సూచించారు. ఈ క్రమంలో అక్కడ పలు నిబంధనలకు సడలింపులు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు సడలింపులు ఇవ్వడంతో పాటు కొన్ని ఆంక్షలతో ప్రజా రవాణా ప్రారంభించారు. అయితే ఈ లోపు మళ్లీ కేసులు రావడంతో కరోనా దేశాల లిస్ట్‌లో న్యూజిలాండ్ మళ్లీ చేరిపోయింది.
Read This Story Also: కరోనా కట్టడికి భారీగా ఇంటింటి సర్వే