అందుకే చాలా బాధగా ఉంది-బాలకృష్ణ
రెట్టింపు వేగంతో 106వ చిత్రాన్ని పూర్తి చేస్తానని నందమూరి బాలకృష్ణ అభిమానులతో అన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఫేస్ బుక్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో మాట్లాడారు. ప్రతి వ్యక్తికి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలుంటాయి.

రెట్టింపు వేగంతో 106వ చిత్రాన్ని పూర్తి చేస్తానని నందమూరి బాలకృష్ణ అభిమానులతో అన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఫేస్ బుక్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో మాట్లాడారు. ప్రతి వ్యక్తికి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలుంటాయి. అలాంటి ఘట్టం 60వ పుట్టినరోజు.. నా షష్టిపూర్తి. ఇలాంటి రోజును అభిమానులతో ఘనంగా జరుపుకోవాలని అనుకున్నాను. కానీ కరోనా కారణంగా అన్నీ ప్రాంతాల నుండి అభిమానులు రావాలంటే చాలా ఆంక్షలున్నాయి. అందువల్ల పుట్టినరోజును జరుపుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది అని ఫ్యాన్స్‌తో అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు మీకు, నాకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి..? ఎందుకు ఇంత ప్రేమ..? అనిపిస్తుంది. నా కష్టాల్లో విజయాల్లో అభిమానలు నాతోనే ఉన్నారు. కొండంత బలంగా నిలిచారు. నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తున్నారు. ఇలా నా వెంట ఉండి ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీరంతా నా ఫ్యాన్స్ అని చెప్పుకోవడం ఆనందంగా… గర్వంగా ఉంది.
మంగళవారం నేను పాడిన “శివ శంకరీ” పాట విడుదలైంది. ఇలాంటి పాట అలపించే సాహసం చేయరు. కానీ నేను చేశా… బ్రహ్మాండగా పాడానని చెప్పను… కానీ ప్రయత్నం చేశాను.. అదే విధంగా నిన్న విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.