కరోనా ఎఫెక్ట్: అక్కడ ఆన్‌లైన్ క్లాసులు షురూ..
కోవిద్-19 నేపథ్యంలో సామాజిక దూరం పాటించి సాధారణ తరగతులు నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి పట్టునే వుండి

Online classes: కోవిద్-19 నేపథ్యంలో సామాజిక దూరం పాటించి సాధారణ తరగతులు నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఫలితంగా పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటి పట్టునే వుండి చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పాఠశాలల యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చూడాలని పాఠశాలల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
కర్ణాటక ప్రభుత్వం ఎల్‌కెజి నుండి 5 వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఆన్‌లైన్ లైవ్ క్లాసులు నిర్వహిస్తోంది. 6-10 తరగతుల కోసం, ఆన్‌లైన్ క్లాసెస్ పై సూచనలు సలహాలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ 10 రోజుల్లో ఒక నివేదికను సమర్పించనుంది. నివేదికను బట్టి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం



