గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సబిత

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌ పల్లి పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు..

గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సబిత
Follow us

|

Updated on: Jun 10, 2020 | 10:42 PM

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌ పల్లి పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక శాసన సభ్యుడు కాలె యాదయ్య, జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితా రెడ్డితో కలిసి మంత్రి సబిత శంకుస్థాపన చేశారు. అలాగే ముబారక పూర్‌, గంగ్యడ గ్రామాల్లో నాలుగు కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపునకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ రైతును రాజును చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. యువత వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు వేసి లాభాలు పొందాలన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

Latest Articles