కరోనాతో పోరాడి ఓడిన బీఎస్ఎఫ్ జవాన్
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా గజగజ వణికిస్తోంది. మన దేశంలో కూడా ఈ వైరస్ గత కొద్ది రోజులుగా విజృంభిస్తోంది. ఇప్పటికే 2.7 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా గజగజ వణికిస్తోంది. మన దేశంలో కూడా ఈ వైరస్ గత కొద్ది రోజులుగా విజృంభిస్తోంది. ఇప్పటికే 2.7 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి దాటికి సామాన్యుడి నుంచి మొదలు కొని.. అన్ని వర్గాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది కూడా మరణిస్తున్నారు. తాజాగా బార్డర్ సెక్యురీటీ ఫోర్స్‌కు చెందిన ఓ జవాన్.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. జూన్ 5వ తేదీన కరోనా లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ జవాన్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా మరణించిన జవాన్‌తో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన బీఎస్ఎఫ్ జవాన్ల సంఖ్య మూడుకు చేరింది.