మహా విలయంః 393 కేసులు..25 మరణాలు
భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లలో దేశంలో 73 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది.

భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లలో దేశంలో 73 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 9,318 కరోనా కేసులు నమోదు కాగా, 400 మంది మృతి చెందారు. తాజాగా 393 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
కోవిడ్ -19 ధాటికి మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 393 పాజిటివ్ కేసులు నమోదవగా… 25 కోవిడ్ మరణాలను నిర్ధారణ అయ్యాయని బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) ప్రకటించింది. 393 కేసుల్లో 291 కేసులకు సంబంధించిన శాంపిల్స్‌ను సోమవారం పరీక్షిస్తే మంగళవారం రిపోర్టులు వచ్చాయి. మిగిలిన 102 కేసులకు సంబంధించిన శాంపిల్స్‌ను ఏప్రిల్ 25, 26న పరీక్షిస్తే.. వాటి రిపోర్టులు ఇవాళ వచ్చినట్లు అధికారులు తెలిపారు.