నెల్లూరులో కరోనా పేషెంట్లకు రోబో సేవలు
నెల్వార్ట్ అనే రోబో ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా పేషెంట్లకు మందులు, ఆహార పదార్థాలను అందజేస్తోంది. నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను రూపొందించారు. ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు..

కరోనా వైరస్‌పై మానవాళి చేస్తున్న పోరాటంలో డాక్టర్లు ముందు వరుసలో ఉన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పేషెంట్లకు సేవలందిస్తున్నారు. దీంతో కొంతమంది డాక్టర్లకు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వాలు డాక్టర్లకు పీపీఈ సూట్లు, మాస్క్‌లు అందించాయి. కాగా అయితే వైద్యులకు మరింత రిస్క్ తగ్గించేందుకు రోబోను తీసుకొస్తున్నారు. ఏపీలోని నెల్లూరులో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో రోబోలను ప్రవేశపెట్టారు. రీజినల్ కోవిడ్ సెంటర్‌లో మంగళవారం రోబో సేవలను జిల్లా వైద్యాధికారులు ప్రారంభించారు.
నెల్వార్ట్ అనే రోబో ఐసోలేషన్ వార్డులో ఉన్న కరోనా పేషెంట్లకు మందులు, ఆహార పదార్థాలను అందజేస్తోంది. నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను రూపొందించారు. ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని కరోనా రోగులకు సరఫరా చేస్తుందని అధికారులు వివరించారు. అలాగే మరో రెండు రోబోలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు. కాగా ఆ రోబో పనితీరును పరిశీలించిన కరోనా వైరస్ ప్రత్యేక అధికారి రామ్ గోపాల్, కలెక్టర్ శేషగిరి బాబు, జేసీ డాక్టర్ వినోద్ కుమార్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులను అభినందించారు.
కాగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో 1,332 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 31 మంది మృతి చెందారు. అలాగే ప్రస్తుతం 1014 మంది చికిత్స పొందుతుండగా.. 287 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Read More: తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ