లాక్ డౌన్ బేఖాతరు చేసి సెలూన్ తెరిచాడు.. కరోనాను అంటించాడు.!
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించి కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఆ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీనితో వారికి మాత్రమే కాకుండా మిగిలినవారికి సైతం ప్రమాదం పొంచి ఉంటోంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో నివాసముండే ఓ 36 ఏళ్ల వ్యక్తి కోయంబేడులో […]

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించి కఠినంగా అమలు చేస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఆ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీనితో వారికి మాత్రమే కాకుండా మిగిలినవారికి సైతం ప్రమాదం పొంచి ఉంటోంది. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా చెన్నైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో నివాసముండే ఓ 36 ఏళ్ల వ్యక్తి కోయంబేడులో తన హెయిర్ సెలూన్‌ను యధావిధిగా నిర్వహించాడు. అయితే ఏప్రిల్ 23న అతడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉండే కిల్పుక్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది.
దీనితో కోయంబేడు పోలీసులు ఆ సెలూన్‌కు వచ్చిన వారిని, ఆ వ్యక్తిని గత కొద్దిరోజులుగా కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటిదాకా 32 శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపినట్లు వైద్య అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆ సెలూన్ యజమాని 10 నుంచి 15 మంది ఇళ్లకు వెళ్లి కూడా హెయిర్ కటింగ్, షేవింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ వ్యవహారం బయటికి రావడంతో స్థానికంగా ఉండే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read This: అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..