Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్..అసలు జైస్వాల్‌కి వచ్చిన ఆ జబ్బు ఏంటో తెలుసా ?
Yashasvi Jaiswal : టీమిండియా యువ సంచలన బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ తీవ్ర అస్వస్థతతో పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. మ్యాచ్ సమయంలో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తీవ్ర అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Yashasvi Jaiswal : టీమిండియా యువ సంచలన బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ తీవ్ర అస్వస్థతతో పూణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో చేరారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. మ్యాచ్ సమయంలో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తీవ్ర అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు జైస్వాల్‌ను పరీక్షించారు. సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షల అనంతరం అతని కడుపులో వాపు ఉన్నట్లు గుర్తించారు. చివరికి, జైస్వాల్ తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ (కడుపులో ఇన్ఫెక్షన్)తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది.
జైస్వాల్‌కు ప్రస్తుతం ఇంట్రావీనస్ (IV) ద్వారా మందులు ఇస్తున్నారు. అతను త్వరలోనే కోలుకుంటారని వైద్యులు తెలిపారు. అయితే, పూర్తిగా కోలుకునే వరకు అతను క్రికెట్ ఆడటం మంచిది కాదని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ అనారోగ్యం పాలయ్యే ముందు, జైస్వాల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హర్యానాతో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను కేవలం 50 బంతుల్లో 101 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Yashasvi Jaiswal has been admitted to the hospital due to stomach swelling. Wishing him a speedy and complete recovery. Get well soon, champ 🤍 pic.twitter.com/BgFymmGPA6
— jaiswalhype (@jaiswalhype19) December 16, 2025
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియా టీ20 జట్టులో భాగం కాదు. సౌతాఫ్రికా టీ20 సిరీస్ తర్వాత, టీమిండియా తదుపరి సిరీస్‌ను వచ్చే సంవత్సరం జనవరిలో న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి, టీ20 సిరీస్ జనవరి 21 నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో జైస్వాల్‌కి పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి తగినంత సమయం దొరికినట్లే.
అద్భుతమైన టీ20 ప్రదర్శనలు ఉన్నప్పటికీ, యశస్వి జైస్వాల్ ఇటీవల జరిగిన అనేక టీ20 సిరీస్‌లలో జట్టులో స్థానం కోల్పోవడం ఆశ్చర్యకరం. దీంతో అతను రాబోయే టీ20 ప్రపంచ కప్ రేసు నుంచి వెనుకబడినట్లుగా భావిస్తున్నారు. అతని స్థానంలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. గిల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. జైస్వాల్ టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించినా, అతన్ని అకస్మాత్తుగా జట్టు నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




