బూడిద గుమ్మడికాయ కేవలం సాంప్రదాయ ప్రయోజనాలకే కాకుండా, పోషకాల గని అని డైటీషియన్లు సూచిస్తున్నారు. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఈ కూరగాయ డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, రోగనిరోధక శక్తి పెంపు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.