Sanitiser Ganesh: శానిటైజర్ గణేష్‌ని చూశారా?
ప్రతియేటా వినాయక చవితికి సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ప్రతీ వీధిలోని గణేష్ మండపాలతో కలకల్లాడుతూ కనిపించేవి. కానీ ఈ ఏడాది అలాంటి ఆశలకు నీళ్లు జల్లినట్టైంది. ఈ మాయదారి కరోనా మహమ్మారి కారణంగా జనాలు బయటకు రావడానికే..

Sanitiser Ganesha Idols: ప్రతియేటా వినాయక చవితికి సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ప్రతీ వీధిలోని గణేష్ మండపాలతో కలకల్లాడుతూ కనిపించేవి. కానీ ఈ ఏడాది అలాంటి ఆశలకు నీళ్లు జల్లినట్టైంది. ఈ మాయదారి కరోనా మహమ్మారి కారణంగా జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. దీంతో ప్రతి గల్లీకి పెట్టుకునే విగ్రహాలను ఇప్పుడు నిలిపివేశారు. దీంతో విగ్రహాలతో పని లేకుండా పోయింది. దీంతో వినూత్నంగా గనేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. కరోనా వైరస్ సోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా శానిటైజర్ గణేష్ విగ్రహాలను తయారు చేశారు డిజైనర్ రామ్ దాస్ చౌదరి.
ముంబైలో కొనసాగుతున్న మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విగ్రహానికి సెన్సార్ మెషీన్లు అమర్చారు. ఎవరైనా తమ చేతులను విగ్రహం దగ్గర పెడితే సెన్సార్ ద్వారా శానిటైజర్ వారి చేతుల్లో పడుతుంది. ఈ గణేశుడు కరోనా మహమ్మారిని తరిమికొడతాడని నమ్ముతూ విగ్రహ ఆయుధంలో శానిటైజర్‌ను ఉపయోగించామన్నారు రామ్ దాస్. ప్రస్తుతం ఇలాంటి విగ్రహాల కోసం మహారాష్ట్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. కానీ ఈ విగ్రహాల తయారీకి ఉపయోగించే పదార్థాలు అంత సులువుగా దొరకదంటున్నారు.
Maharashtra: An artist from Mumbai’s Ghatkopar has made ‘sanitizer Ganesha idols’ ahead of #GaneshaChaturthi.
He says, “COVID-19 is still here, so I have made idols that dispense sanitizer. It functions automatically when people place their hands under it to sanitize them.” pic.twitter.com/ns5SPP3CSt
— ANI (@ANI) August 18, 2020
Also Read:
బ్రేకింగ్: ఓటీటీలో విడుదల కానున్న `వి` సినిమా
Kushboo Eye Injury : ప్రముఖ నటి కుష్బూ కంటికి గాయం
మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో 50 శాతం కోత
నటి శివ పార్వతికి కరోనా పాజిటివ్.. ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన!



