“మహా”లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కంటీన్యూ అవుతూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ్టి కేసులతో కలిపి రెండు లక్ష మార్క్ దాటింది. ఆదివారం రికార్డు స్థాయిలో 6,555 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కంటీన్యూ అవుతూనే ఉంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ్టి కేసులతో కలిపి రెండు లక్ష మార్క్ దాటింది. ఆదివారం రికార్డు స్థాయిలో 6,555 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. అందులో 86,040 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉన్నాయి. ఇక కరోనా మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో అధికంగానే ఉంటోంది. ఆదివారం కొత్తగా 151 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారినపడి 8,822 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబులకు అనుమతినిచ్చింది.