దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా

దేశవ్యాప్తంగా కరోనా దాడి ఆగడం లేదు. ఇన్నాళ్లూ భారీగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో నెమ్మదిగా కేసులు తగ్గుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న కరోనా
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 05, 2020 | 8:54 PM

దేశవ్యాప్తంగా కరోనా దాడి ఆగడం లేదు. ఇన్నాళ్లూ భారీగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో నెమ్మదిగా కేసులు తగ్గుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బెంగాల్ లో గణనీయంగా కేసుల సంఖ్య పెరగుతుంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 895 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 22,126కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 21 మంది కరోనాతో మరణించారు. దీంతో 757మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 545 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6,658 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకూ 14,711మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక, కర్ణాటకలో నమోదైన కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 37 మంది కరోనా వల్ల మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో.. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 372కి చేరింది. ఇక అదివారం రాష్ట్రవ్యాప్తంగా 1,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,474కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 13251కి చేరింది. అయితే, గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 603 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ మొత్తంగా 9,847 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

అటు, ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 8,167కు చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం 18,761 మంది పేషెంట్లకు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 785 కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు.

కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 6,73,165 కరోనా కేసులు ఇంతవరకూ నమోదా కాగా, ఇందులో 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,09,083 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 19,268కి చేరింది.