మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. 2 లక్షలు దాటిన కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. శనివారం నాడు మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఇక్కడి..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. శనివారం నాడు మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఇక్కడి నుంచే నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,064కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 295 మంది మరణించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 83,295 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
Maharashtra reported 7,074 COVID-19 cases and 295 deaths in the last 24 hours, taking total number of cases to 2,00,064 and death toll to 8,671. Number of active cases stands at 83,295: State Health Department pic.twitter.com/1khzthSUgi
— ANI (@ANI) July 4, 2020
ఇక ముంబైలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.శనివారం నాడు 1,180 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోన బారినపడి 68 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,071 మంది కోలుకున్నారని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. నగరంలో ప్రస్తుతం24 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 53 వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.
1180 #COVID19 cases, 1071 recovered & 68 deaths reported in Mumbai today. Total number of cases in the city is now at 82814, including 53463 recovered/discharged, 24524 active cases & 4827 deaths: Brihanmumbai Municipal Corporation (BMC) pic.twitter.com/8Rcrwwk0P4
— ANI (@ANI) July 4, 2020