అడ్డంగా దొరికిన కాడికి దోచుకుంటోన్న లిక్కర్ వ్యాపారులు.. క్వార్టర్ @ 300

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్‌లతో పాటు వైన్స్ షాపులను కూడా అధికారులు బంద్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని..

అడ్డంగా దొరికిన కాడికి దోచుకుంటోన్న లిక్కర్ వ్యాపారులు.. క్వార్టర్ @ 300
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 2:41 PM

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్‌లతో పాటు వైన్స్ షాపులను కూడా అధికారులు బంద్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని బాగా వేధిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు.. చాలా రాష్ట్రాల్లోనూ కరోనా లాక్ డౌన్ కారణంగా.. బార్లు, మద్యం షాపులూ మూసేయడంతో లిక్కర్ లేక మద్యం ప్రియులు విలవిల్లాడితున్నారు. దాదాపు 10 రోజులుగా మద్యం దొరక్కపోవడంతో మందుబాబులకు పిచ్చెక్కినట్టు ఉంటోంది. ఒకరిద్దరు మందు బాబులు ఆత్మహత్య చేసుకున్నారు. మరికొందరైతే ఆత్మహత్యాయత్నం చేశారు. మందు బాబుల అవసరాలే తమకు లక్కీ ఛాన్స్ అనుకుని బెల్టు షాపుల నిర్వాహకుల ఇష్టా రాజ్యంగా ధరలు పెంచేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు.

ప్రస్తుతం మద్యం లభించని కారణంగా.. దొరికిందే ఛాన్స్‌గా అందినకాడికి దండుకుంటున్నారు. ఎమ్మార్పీ కన్నా రెండు, మూడింతలు అధికంగా విక్రయిస్తూ మందు బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏకంగా క్వార్టర్ మద్యం రూ.120 ఉండగా.. ప్రస్తుతం గ్రామాల్లో రూ.300 నుంచి 400లకు అమ్ముతున్నారు. కొంతమందైతే బాహాటంగానే విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. దీన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో మద్యం దుకాణాల మూతతో బెల్టు షాపుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనేక జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. కాగా.. ఇప్పటికే చాలా మంది మందు తాగక.. ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అనే వ్యాధి ముదురుతోంది.

ఇవి కూడా చదవండి: సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం..

అభిమానులకు కాదు.. జనరల్ ఆడియన్స్‌కి రీచ్ అయితే నేను హ్యాపీ

వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’

వాట్సాప్ నుంచే ఐసిఐసిఐ బ్యాంకు సేవలు

ఆల్కహాల్ బ్యాన్.. పెరుగుతోన్న మరో భయంకర వ్యాధి.. 8 మంది మృతి

ప్రభుత్వం వద్దంటోంది.. EMI వాడేమో కట్టాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు

లాక్‌డౌన్: దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పీఎం మోదీ

డేంజరస్ వైరస్: కోలుకున్న తర్వాత కూడా 8 రోజులు శరీరంలోనే

కరోనా వైరస్ సోకితే.. ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే? మీకోసమే!