సెట్స్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైన కేజీఎఫ్-2 టీమ్
దక్షిణాదిన భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైన సమయానికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి 15 రోజుల షూటింగ్ మాత్రమే..
దక్షిణాదిన భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైన సమయానికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి, మిగిలిన పనులు చూసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు దర్శకుడు ప్లాన్ చేశారట. కాగా ప్రస్తుతం ఇందులో ఇద్దరు బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అధీరాగా సంజయ్ దత్ లుక్ రిలీజ్ అయ్యింది. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా మరోసారి సెట్స్ పైకి వెళ్లనుంది.
కేజీఆర్ కనెక్షన్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్ర యూనిట్‌తో ఉన్న ఫొటో ఒకటి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీన్ని పూర్తి చేద్దాం అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అలాగే సంజయ్ దత్‌కు సంబందించిన షూట్ దాదాపు పూర్తి అయిందని, కేవలం డబ్బింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఈ మూవీ మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. దీంతో ఈ నెల 26 నుంచి బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో కేజీఎఫ్-2 షూటింగ్ మొదలు కాబోతుంది. ఇందులో యశ్‌తో పాటు ప్రకాష్ రాజ్, మాళవిక, అవినాష్ తదితరులు పాల్గొనబోతున్నారట. దీని కోసం డైరెక్టర్ ప్రశాంత్ లోకేషన్‌లో రెక్కీ నిర్వహించారట.
Read More:
ఎమ్మెల్యే రోజా, సెల్వమణి దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆలీ కూతురు.. మా గంగానదిగా!