శరద్ పవార్ నివాసంలో కరోనా కలకలం
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. బారామతి జిల్లాలోని గోవింద్ బగ్ ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో పనిచేస్తున్న నలుగురు వర్కర్స్‌కు కరోనా సోకింది. అయితే..
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. బారామతి జిల్లాలోని గోవింద్ బగ్ ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో పనిచేస్తున్న నలుగురు వర్కర్స్‌కు కరోనా సోకింది. అయితే వారి కుటుంబంలో ఎవరికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలలేదన్నారు. ఈ విషయాన్ని బారామతి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్న సంగతి తెలిసిందే.
4 domestic help workers working at NCP leader Sharad Pawar’s bungalow in Govind Baug, Baramati have tested positive for #COVID19. Nobody from his family has tested positive yet: District Health Official, Baramati District, #Maharashtra
— ANI (@ANI) August 21, 2020
Read More :