కరోనా టైంలో ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ.. ధర ఎంతంటే?
అసలే ఇప్పుడు కరోనా టైం.. బయటకు వస్తే ఎంటు నుంచి ఎలా ఈ వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు హోటల్స్, రెస్టారెంట్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్లు మంచి మంచి ఆఫర్స్ ఇచ్చినా..
అసలే ఇప్పుడు కరోనా టైం.. బయటకు వస్తే ఎంటు నుంచి ఎలా ఈ వైరస్ సోకుతుందో తెలియక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు హోటల్స్, రెస్టారెంట్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్లు మంచి మంచి ఆఫర్స్ ఇచ్చినా కూడా కస్టమర్లు రావడం లేదు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరికొంత మంది వినూత్నంగా ఆలోచించి.. తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
కరోనా సమయంలో అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ అంటూ ఓ హోటల్ నిర్వాహకులు మార్కెట్లోకి వచ్చాడు. దీంతో ఈ బిర్యానీ తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఐస్ లాండ్ హోటల్ నిర్వాహకుడు రోగ నిరోధక శక్తిని పెంచే చికెన్ ధమ్ బిర్యానీ అంటూ వెరైటీ ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాగా ప్రస్తుతం ఈ బిర్యానీ సింగిల్‌కి రూ.140గా నిర్ణయించారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు హోటల్స్‌లో తినాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో హోటల్ రంగం సగానికి సగం పడిపోయింది.
ఇలాంటి సమయంలో ఈ ఆయుర్వేదిక్ బిర్యానీని తయారు చేసి, లాభాలు గడిస్తున్నాడు. ఈ బిర్యానీ కోసం అక్కడి గ్రామస్తులే కాకుండా.. చుట్టు ప్రక్క గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చి బిర్యానీ తింటున్నారు. ఈ బిర్యానీలో దాల్చిన చెక్క, సొంఠి, మిరియాలు, లవంగాలు, ఉసిరి, తులసి పౌడర్ వంటి వివిధ రకాల మూలికలతో బిర్యానీ తయారు చేస్తున్నట్లు ఐస్ ల్యాండ్ నిర్వాహకుడు తెలిపాడు.
Also Read:
గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు
హీరో సుధాకర్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్
సీఎంవో సిబ్బందికి కరోనా పాజిటివ్.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం