సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సీఎంవో సిబ్బంది స‌హా త‌న నివాసంలో ప‌ని చేస్తున్న ప‌ది మందికి కోవిడ్ పాజిటివ్ సోకిన‌ట్టు గురువారం నిర్థార‌ణ అయింది. దీంతో ముందు జాత్ర‌త్త‌లో భాగంగా సీఎం త‌న అధికారిక కార్య‌క్ర‌మాల‌న్నిటినీ ర‌ద్దు..

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 12:01 PM

రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. సీఎంవో సిబ్బంది స‌హా త‌న నివాసంలో ప‌ని చేస్తున్న ప‌ది మందికి కోవిడ్ పాజిటివ్ సోకిన‌ట్టు గురువారం నిర్థార‌ణ అయింది. దీంతో ముందు జాత్ర‌త్త‌లో భాగంగా సీఎం త‌న అధికారిక కార్య‌క్ర‌మాల‌న్నిటినీ ర‌ద్దు చేసుకున్నారు. క‌రోనా లాక్ డౌన్ త‌ర్వాత ఏర్పాటు చేసిన మొద‌టి మంత్రి మండ‌లి స‌మావేశాన్ని కూడా అశోక్ గెహ్లాట్ ర‌ద్దు చేసుకున్నారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి జైపూర్‌కు ఎవ‌రూ రావ‌ద్ద‌ని కోరారు. ఇక ఎవ‌రికైనా కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంటనే వారిని టెస్ట్ చేయించుకోవాల‌ని సూచించారు.

కాగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేసే 9 మందికి, సీఎం అధికారిక నివాసంలో ప‌ని చేసే ఒక‌రికి క‌రోనా సోకిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక ఇప్ప‌టికే సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్‌లోని ప‌ర్యాట‌క శాఖ మంత్రి విశ్వేంద‌ర్ సింగ్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Read More:

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’

నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి

వ‌ర‌ల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు