కరోనా రచ్చ.. తన్నుకున్న గ్రామస్థులు

కరోనా సోకిందని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చింతకాని మండలం నరసింహాపురం గ్రామంలో ఇరువర్గాల దాడికి దిగారు. మాకు కరోనా సోకిందని ప్రచారం చేస్తారా.. మీ వల్లే చాలామందికి గ్రామంలో కరోనా వచ్చిందంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

కరోనా రచ్చ.. తన్నుకున్న గ్రామస్థులు
Follow us

|

Updated on: Aug 28, 2020 | 4:56 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కరోనాతో చాలా దేశాల్లోని జనాభ తుడిచిపెట్టుకుపోతోంది. కుటుంబాలను మింగేస్తోంది. మానవత్వం మంటగలుస్తోంది. ఇంత కాలం మెట్రో నగరాలు.. జిల్లా కేంద్రాలకు మాత్రమే కరోనా వ్యాప్తి ఉండింది. అయితే.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. దీంతో ఎవరికిె కరోనా ఉందో.. ఎవరికి లేదో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ కరోనా రక్కసి ఓ గ్రామంలో అగ్గి రాజేసింది. ఇంత కాలంగా కలిసి ఉంటున్న ఆ గ్రామస్థుల మధ్య చిచ్చు పెట్టింది. ఇది ఎక్కడో కాదు ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో…  కరోనా సోకిందని అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చింతకాని మండలం నరసింహాపురం గ్రామంలో ఇరువర్గాల దాడికి దిగారు. మాకు కరోనా సోకిందని ప్రచారం చేస్తారా.. మీ వల్లే చాలామందికి గ్రామంలో కరోనా వచ్చిందంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

కరోనా సోకిన వ్యక్తి, వారి బంధువుల ఇంటిపై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహపురంలో చర్చనీయాంశమైంది. అయితే కరోనా లేని వారికి కూడా ఉన్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఓ వర్గం వారు.. కరోనా సోకిన వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. దీంతో ఈ సంఘటన గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు.

ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన అయిదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అసత్య ప్రచారాలతో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఈ ఘటనపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు.