ఈ గొర్రె రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !
ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఓ గొర్రె ఖరీదు అంతనా? అని కచ్చితంగా నోరెళ్లబెడతారు.
ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఓ గొర్రె ఖరీదు అంతనా? అని కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఈ నెల 27న (గురువారం) స్కాట్‌లాండ్, లనార్క్‌లో జరిగిన స్కాటిష్ లైవ్‌స్టాక్ ఆక్షన్‌లో డబుల్ డైమండ్ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల రేటు (£3,65,000) పలికింది. దీంతో వరల్డ్‌లో అత్యంత కాస్ట్లీ గొర్రెగా ఖ్యాతి గడించింది. గతంలో 2,31,000 స్టెర్లింగ్ పౌండ్లపై ఉన్న రికార్డును డైమండ్ తునాతునకలు చేసింది. 68 వేల స్టెర్లింగ్ పౌండ్‌లతో హెక్సెల్ డ్జాంగో అనే గొర్రె డైమండ్ తర్వాతి ప్లేస్ సంపాదించింది.
చెషైర్, స్టాక్‌పోర్టుకు చెందిన ఫేమస్ బ్రీడర్ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్ కూడా ఒకటి. నెదర్లాండ్‌లోని టెక్సెల్ ప్రాంతానికి చెందిన బ్రీడ్ కావడంతో వీటిని టెక్సెల్ జాతి గొర్రెలని పిలుస్తారు. యూకేలో వీటి మాంసానికి హై డిమాండ్ ఉంటుంది. మామూలుగా ఈ జాతి గొర్రెలు 100 స్టెర్లింగ్ పౌండుల రేటు పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలు ఇలా హై రేటు పలుకుతుంటాయి.
Also Read :
సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు